నిప్పులు చెరిగిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ – కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. గతంలో అసెంబ్లీ
ఏ విధంగా జరుగుతుందో ప్రజలు చూసే వాళ్లన్నారు. కానీ ప్రస్తుతం అసెంబ్లీని కౌరవ సభ లాగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కావాలని అవమానించ లేదన్నారు. ఎక్కడ నిలదీస్తారోననే భయంతోనే వేటు వేశారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆనాడు తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి చర్యలకు పాల్పడ లేదన్నారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడేందుకు ఛాన్స్ ఇచ్చామన్నారు మాజీ మంత్రి.
భారత రాజ్యాంగమన్నా, చట్ట సభలన్నా , స్పీకర్ అన్నా తమ పార్టీకి గౌరవమన్నారు. కానీ కావాలని కాంగ్రెస్ సర్కార్ ఇలా చేస్తున్నదంటూ మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమదేనని అన్నారు. సెక్రటేరియట్ కు అంబేద్కర్ విగ్రహం పేరు కూడా పెట్టింది తామేనన్నారు. దళితులకు దళిత బంధు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చారని గుర్తు చేశారు.