NEWSTELANGANA

విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించిన శ్రీ‌నివాస్ గౌడ్

Share it with your family & friends

మెరుగైన వైద్య‌సాయం అందించాలి

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా – మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీినివాస్ గౌడ్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నారాయణపేట జిల్లా మంగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మూడవ సారి మధ్యాహ్న భోజనం వికటించి (ఫుడ్ పాయిజన్) తో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బుధ‌వారం మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ఆస్ప‌త్రికి వెళ్లి అక్క‌డ చికొత్స పొందుతున్న‌ విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వి. శ్రీ‌నివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలపై జిల్లా విద్యా శాఖ అధికారి, జిల్లా కలక్టర్ పర్యవేక్షించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఇంత జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, గురుకులాలు, ఇత‌ర పాఠ‌శాల‌లో పేద పిల్ల‌లు చ‌దువుకుంటార‌ని , వారికి మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై ఉంద‌న్నారు.

జిల్లాకు చెందిన మంత్రుల‌తో పాటు ఇంఛార్జి మంత్రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్.