మాజీ మంత్రుల కీలక డిమాండ్
హైదరాబాద్ – అందాల పోటీలు కట్టపెట్టి మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి. ఎంఎంటీఎస్ ట్రైన్ లో బాధితురాలపై అత్యాచారం యత్నం జరిగినా ఇప్పటి వరకు సర్కార్ నుంచి స్పందన లేక పోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. మహిళ కోచ్ లోకి ప్రవేశించి అత్యాచారం యత్నానికి పాల్పడడం చూస్తే మనం ఎక్కడున్నామో తెలియకుండా పోయిందన్నారు. ఆగంతకుడి నుంచి తప్పించు కునేందుకు బాధితురాలు ట్రైన్ దూకాల్సి వచ్చిందన్నారు. తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతోందన్నారు.
సోమవారం మాజీ మంత్రులు గౌడ్, సబిత మీడియాతో మాట్లాడారు. బస్సులో , ట్రైన్స్ లో కూడా మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి. ప్రస్తుతం మహిళలు పై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22 శాతం పెరిగినట్లు నివేదికలు చెపుతున్నాయన్నారు. మహిళల భద్రత పై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ఓ తల్లి తన కూతుళ్లు భద్రంగా ఉండాలి అని కోరుకుంటుంది , అందాల పోటీలు కోరుకోవడం లేదన్నారు. బాధితురాలు పళ్లు ఊడి పోయాయని, ఇప్పటి దాకా డెంటల్ డాక్టర్ రాలేదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.