జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే
కండువా కప్పుకున్న రామాంజనేయులు
అమరావతి – రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే పి. రామాంజనేయులు ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో కొంత కాలం పాటు చర్చలు జరిపారు. మంగళవారం పార్టీలో చేరారు. కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇంకొందరు సీనియర్ నాయకులు తమ పార్టీలో చేరనున్నారని జోష్యం చెప్పారు . రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు జగన్ రెడ్డిని భరించే స్థితిలో లేరని పేర్కొన్నారు.
ఆక్టోపస్ లాగా అల్లుకు పోయిన వైసీపీ పార్టీని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని , దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి తప్పకుండా విజయం సాధించడం ఖాయమని అన్నారు పవన్ కళ్యాణ్.