విచారణ చేపట్టిన పోలీసులు
అమరావతి – గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ విచారించనున్నారు పోలీసులు. ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు సిద్దమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వంశీని విచారిస్తారు. సత్యవర్దన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపడతారు.
ఇదిలా ఉండగా తన అరెస్ట్ అక్రమమని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే. దీనిపై కౌంటర్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.
తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. వల్లభనేని వంశీ అక్రమాలు, భూ కబ్జాలపై నలుగురితో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది. ఓ వైపు పోలీసుల విచారణ ఇంకో వైపు సిట్ ఏర్పాటుతో వంశీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరో వైపు తమ పార్టీకి చెందిన నాయకులను, మాజీ మంత్రులను, ప్రజా ప్రతినిధులను కావాలని సర్కార్ వేధింపులకు గురి చేస్తోందని జగన్ ఆరోపించారు.