టీడీపీ నేత బుద్దా వెంకన్న
విజయవాడ – ఓ వైపు హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా టీడీపీ నేతలు పట్టించు కోవడం లేదు. నారా లోకేష్ నెక్ట్స్ సీఎం అంటూ గొంతు విప్పుతున్నారు. లోకేష్ పుట్టిన రోజు వేడుకలు విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ యువ గళం పాదయాత్ర వల్లనే పార్టీకి భారీగా సీట్లు వచ్చాయన్నారు. చంద్రబాబు తర్వాత కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండ బద్దలు కొట్టారు.
నారా లోకేష్ రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన నాయకుడు కాదన్నారు. ఆయన ప్రజల్లోంచి ఎదిగిన నాయకుడంటూ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అన్ని లక్షణాలు తనకు ఉన్నాయని చెప్పారు. పార్టీకి చెందిన మంత్రులతో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా ముక్త కంఠంతో లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి లేదా సీఎం గా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకు రావడంలో చంద్రబాబు , లోకేష్ చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. లోకేష్ ముందు చూపు, దూరదృష్టి రాష్ట్రానికి అత్యంత అవసరమని స్పష్టం చేశారు.