కేసీఆర్ సన్మానం మాజీ ఎమ్మెల్సీ సంతోషం
శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఘన సన్మానం
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ వాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సన్మానంతో మాజీ ఆచార్యుడు సంతోషానికి లోనయ్యారు.
ఇది కేవలం తనకు జరిగిన సత్కారమే కాదు.. తన లాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సత్కారంగా భావిస్తున్నట్లు చెప్పారు సన్మాన గ్రహీత శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ జాతిని మేల్కొల్పిన ఉద్యమ రథ సారథి, తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్ అని కొనియాడారు.
కేసీఆర్ వద్ద 25 ఏండ్ల పాటు పని చేయడం తనకు దక్కిన అవకాశంగా , అంతకు మించిన అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ గనుక పోరాటం చేసి ఉండక పోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు. తెలంగాణ ఊపిరిగా బతికారని అన్నారు. ఆయన తన జీవితాన్ని ఈ ప్రాంతం కోసమే అంకితం చేశారని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి.
తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం శాశ్వతంగా ఉంటుందన్నారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన తనకు అమెరికా వెళ్లడం తప్పనిసరిగా మారిందన్నారు. తెలంగాణ వాదులందరి తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.