తను దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
అమరావతి – మాజీ మంత్రి చింతా మోహన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు నిషేధిత సంస్థ అని తెలుసుకుంటే మంచిదన్నారు. రామాలయం కట్టిన తర్వాతనే దేశానికి స్వేచ్ఛ లభించిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మోడీ స్పందించ లేదంటూ ఫైర్ అయ్యారు చింతా మోహన్.
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కామెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుందన్నారు.
1994లో విజయ భాస్కర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు జరిగాయని, ఏడాదికి ముందు అంటే 1993లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో ఎస్సీలు, ఓబీసీలు ఒక్కటై ములాయంను సీఎంగా ఎన్నుకున్నారని అన్నారు.
ఏపీలో ఓబీసీలను, ఎస్సీలను కలిపేదానికి కాన్సీరామ్ అనే ఒకాయన ఏపీకి వచ్చాడని, ఉత్తరప్రదేశ్లో పరిణామాలు ఆంధ్రప్రదేశ్ పై పడకూడదని ఒక కుట్ర జరిగిందన్నారు చింతా మోహన్.