కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు
అమరావతి – వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణ ముగిసింది. విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్ లో విచారణ కు హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడిన గోరంట్ల కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ నాయకుడు జగన్ ను నిలువరించేందుకే తమను ఇబ్బందులకు ఉరి చేస్తున్నారని ఆరోపించారు.
పలువరు పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలన్నారు. ఏపీలో ఎమెర్జెన్సీ రోజులు గుర్తు చేస్తున్నారని అన్నారు. తమ సర్కార్ హయాంలో ఇలా చేయలేదన్నారు.
తాను ఏం చేశానో పోలీసులు విచారణ సందర్బంగా చెప్పలేదన్నారు. అసలు తనకు ఎందుకు నోటీసులు ఇచ్చారో వారికి కూడా అర్థం కాలేదన్నారు. ఇదంతా కక్ష సాధింపు చర్యలు తప్ప కూటమి సర్కార్ చేస్తున్నది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ.
ఇదిలా ఉండగా ఇప్పటికే వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ప్రముఖ నటుడు , కమెడియన్ పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు. వంశీని విజయవాడ సబ్ జైలుకు పరిమితం చేస్తే, పోసానిని ప్రతి రోజూ ఏదో ఓక పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.