అభివృద్ది అంటే భవనాలు కాదు
మాజీ ఎంపీ హరిరామ జోగయ్య
అమరావతి – మాజీ ఎంపీ హరిరామ జోగయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. అభివృద్ది అంటే పరిపాలనా, నివాస, పార్కులు, కళా, విశ్రాంతి భవనాలు నిర్మించడం కాదన్నారు. ప్రజలందరికీ అత్యంత అవసరమైన విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ది అని అన్నారు. ఆధునిక వైద్య సదుపాయం కల్పించాలన్నారు.
మాజీ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే భవనాలు నిర్మించాలని చెప్పడం, ప్రపంచ, ఏడీబీ బ్యాంకుల జపం చేయడం మానుకోవాలని అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటి అంటూ ఏపీ ప్రభుత్వానికి ఘాటుగా లేఖాస్త్రం సంధించారు హరి రామ జోగయ్య.
రోడ్ల నిర్మాణాలు, సాగునీరు, మురుగు కాల్వల నిర్మాణం, స్వచ్ఛమైన త్రాగు నీరు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు . విద్యా, వైద్యంను యుద్ద ప్రాతిపదికన అందించాలన్నారు.
పాలకొల్లులో ఆధునిక వైద్య సదుపాయం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు హరి రామ జోగయ్య. కేవలం ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కోట్లాది రూపాయిల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ.