అమిత్ షాపై వీహెచ్ ఫిర్యాదు
తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్
హైదరాబాద్ – మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు నిప్పులు చెరిగారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై హైదరాబాద్ లోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
శనివారం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. తక్షణమే అమిత్ షాను అరెస్ట్ చేయాలని కోరారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, 143 కోట్ల భారతీయులను కించ పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు వీహెచ్.
తమ పార్టీకి చెందిన మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీపై అక్రమ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఏకపక్షంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కావాలని ఇండియా కూటమి నేతల పట్ల కక్ష సాధింపు తో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు వి. హనుమంతరావు.
ఈ దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీతో పాటు దాని అనుబంధ సంస్థలు మాత్రమే ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కోరుకుంటున్నారని, అందుకే వారు భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారంటూ ఆరోపించారు.