పీసీసీ మాజీ చీఫ్ నర్సారెడ్డి కన్నుమూత
మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం
హైదరాబాద్ – తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ఏపీ పీసీసీ , మాజీ మంత్రి నర్సారెడ్డి సోమవారం అనారోగ్య కారణాల రీత్యా కన్నుమూశారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఇదిలా ఉండగా 1972 నుంచి 2 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా పని చేశారు. నర్సా రెడ్డికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన పలు కీలకమైన పదవులను నిర్వహించారు.
పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పని చేశారు నర్సా రెడ్డి. ఆనాడు జలగం వెంగళరావు ప్రభుత్వంలోని కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మినిస్టీరియల్ కాంప్లెక్స్ సమీపంలోని వైట్ హౌస్ లో ఆయన నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం తెలిపారు.