భారత, ఇంగ్లండ్ కెప్టెన్లతో భేటీ
ముంబై – ముంబైలో పర్యటిస్తున్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ హల్ చల్ చేశారు. పార్సీ జింఖానా గ్రౌండ్ లో ఆయన క్రికెట్ ఆడారు. గల్లీ బాయ్స్ తో కలిసి ఎంజాయ్ చేశారు. వాంఖడే స్టేడియంలో భారత్ , ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన 5వ టి20 మ్యాచ్ ను వీక్షించారు. ఈ సందర్బంగా ఇరు జట్ల కెప్టెన్లు సూర్య కుమార్ యాదవ్, జోష్ బట్లర్ ను కలిశారు. అద్భుతంగా ఆడిన భారత క్రికెటర్ అభిషేక్ శర్మను ప్రత్యేకంగా అభినందించారు మాజీ ప్రధాని.
ఇదిలా ఉండగా సామాజిక మాధ్యమాలలో తన పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా తను ప్రతి రోజూ టెన్నిస్ బాల్, క్రికెట్ ఆడకుండా ఉండలేనని పేర్కొన్నాడు. తన జీవితంలో మరిచి పోలేని పాత్ర ఏదైనా ఉందంటే అది ముంబై నగరమని తెలిపాడు.
మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ వెరీ స్పెషల్. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి, సుధా మూర్తిలకు అల్లుడు. వీరి కూతురును ఆయన చేసుకున్నారు. తాజాగా తాను క్రికెట్ ఆడుతున్న ఫోటో వైరల్ గా మారింది.