NEWSANDHRA PRADESH

ఏపీలో లిబ‌రేష‌న్ కాంగ్రెస్ ఏర్పాటు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఐఏఎస్ విజ‌య కుమార్

అమ‌రావ‌తి – రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ఉన్న‌ట్టుండి మ‌రో కొత్త పార్టీ తెర పైకి వ‌చ్చింది. విచిత్రం ఏమిటంటే ప్ర‌స్తుతం సీఎం ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ మెచ్చుకున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విజ‌యకుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో అధిక జన మహా సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. ‘ లిబరేషన్ కాంగ్రెస్’ పేరుతో నూతన పార్టీ పెడతున్నట్లు విజయ్‌కుమార్ ప్రకటించారు.

ముఖ్యమంత్రి జగన్‌.. పేదల కోసం యుద్ధం చేస్తా అంటున్నారుని.. పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకిచ్చి నిజాయితీ చాటుకోవాలన్నారు. దౌర్జన్యంగా లాక్కున్న వారికి ఆస్తులు చెందేలా చట్టాన్ని మార్చారని.. సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు వెళ్లలేక గిరిజన మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయ‌న ఏకంగా జ‌గ‌న్ ను టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌తంలో సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. విద్యా శాఖతో పాటు అనేక శాఖల్లో పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు.

అలాగే విజయ్ కుమార్ నెల్లూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాలకు కలెక్టర్‌గా గతంలో పనిచేసినప్పుడు తనదైన మార్క్ చూపించారు. విధులకు దూరమయ్యాక కూడా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకున్నారు.