ఆవిష్కరించిన మాజీ స్పీకర్ సిరికొండ
హైదరాబాద్ – సమాచార, పౌర సంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు కన్నెకంటి వెంకట రమణ రాసిన వ్యాసాల సంపుటి ‘కాకతీయుల గురించి మరికొంత…’ అనే పుస్తకాన్ని రాష్ట్ర శాసన మండలి లో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి ఆవిష్కరించారు. విశ్వ బ్రాహ్మణ ధర్మ పీఠం స్వర్ణోత్సవాలు నాంపల్లి లోని తెలుగు విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాకతీయుల గురించి మరికొంత అనే పుస్తకం తోపాటు, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సంచాలకులు చొల్లేటి కృష్ణమాచార్యులు రచించిన ‘విశ్వ శిల్పి రామప్ప రమణీయ శిల్పకళ’ అనే చారిత్రిక నవలల ను కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా మధుసూదనా చారి మాటాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ ల వృత్తులు బాగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం డబ్బు, రాజ్యాధికారం సమాజాన్ని శాషిస్తున్నాయని అన్నారు. విశ్వబ్రాహ్మణ జాతిని అభ్యుదయ పథంలో నడిపించడానికి విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠం ఒక మార్గ దర్శకంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, విశ్వా బ్రాహ్మణ ధర్మపీఠం సభాపతి డా. త్రిమూర్తుల గౌరీశంకర్, పద్మశ్రీ కూరెళ్ల విటలాచార్య, వేలు ఆనందాచారి, డాక్టర్ వేములవాడ మదన్మోహన్, డాక్టర్ లాలుకోట వెంకటాచారి, దైవజ్ఞ శర్మ, కుందారపు గణేష్ చారి, నారోజు మనోరమ, చిలుకూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.