మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్
అమరావతి – మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి సక్సెస్ కాదన్నారు. కృష్ణా నదిలో కేపిటిల్ సిటీ కడితే ఎలా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రాజధాని విషయంలో పొరపాటు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాడని , ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడో చెప్పాలన్నారు. అమరావతిలో ఒక బిల్డింగ్ నిర్మాణానికి పదింతలు అదనపు ఖర్చు అవుతుందన్నారు. సెక్రటేరియట్ కోసం 50 అంతస్తుల భవనాన్ని కట్టాలని అనుకుంటున్నారని, భవిష్యత్తులో ఆ బిల్డింగ్ కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారంటూ నిలదీశారు చింతా మోహన్.
అమెరికాలో వాషింగ్టన్, మలేషియాలో, అలాగే ఆస్ట్రేలియాలో ఒక మహా నగరాన్ని కట్టాలని ఫెయిల్ అయ్యారంటూ స్పష్టం చేశారు. ఒక మహా నగరాన్ని కట్టెముందు అందరి సలహాలు తీసుకోవాలి. మేధావులతో సంప్రదించాలి. చర్చించాలన్నారు. సొంత నిర్ణయాలు వొద్దు. మొండిగా ముందుకు వెళ్లవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సులో ఏముంది? అమరావతిలో కట్టమని కమిటీ చెప్పలేదన్నారు. పేదరికం గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 15 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు ఎంత వరకు పేదరికం తగ్గించారో చెప్పాలంటూ నిలదీశాడు చంద్రబాబును.