BUSINESSTECHNOLOGY

యూట్యూబ్ మాజీ సీఈవో క‌న్నుమూత‌

Share it with your family & friends

క్యాన్స‌ర్ తో సుదీర్ఘ కాలం పోరాటం

అమెరికా – గూగుల్ కు చెందిన సంస్థ యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కీకీ క‌న్ను మూశారు. ఆమె వ‌య‌సు 56 ఏళ్లు. త‌ను కొంత కాలం నుంచి క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. ఎంతో ఇబ్బందులు ప‌డ్డారు. యూట్యూబ్ ను కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు చేర వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఎన్నో మార్పులు తీసుకు వ‌చ్చారు.

సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు సుసాన్ వోజ్కీకీ. ఈ సంద‌ర్బంగా గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె అందించిన సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

సుసాన్ వోజ్కీకీ 2 సంవ‌త్స‌రాలుగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ ప‌డింద‌ని తెలిపారు గూగుల్ సీఈవో. ఇదిలా ఉండ‌గా ఆమె మ‌ర‌ణ వార్త‌ను భ‌ర్త డెన్నిస్ ట్రోవ‌ర్ ధ్రువీక‌రించారు. ఆయ‌న ఈ వార్త‌ను ఫేస్ బుక్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

సుసాన్ వోజ్కికీ మరణ వార్తను నేను చాలా బాధతో పంచుకుంటున్నాను. 26 సంవత్సరాల నా ప్రియమైన భార్య , మా ఐదుగురు పిల్లలకు తల్లి . ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చివ‌రి దాకా పోరాడింద‌ని వాపోయారు. సుసాన్ నాకు ప్రాణ స్నేహితురాలు . జీవితంలో భాగస్వామి మాత్రమే కాదు, తెలివైన మనస్సు, ప్రేమగల తల్లి అని పేర్కొన్నారు.