ఈడీకి కీలక పత్రాలు సమర్పణ
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా – ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేసింది అవినీతి నిరోధక శాఖ. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, ఒప్పంద ప్రతాలతో పాటు ఎఫ్ఐఆర్‌ను కూడా ఈడీకి అందజేసింది ఏసీబీ. హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ ను దాఖలు చేసింది. కీలకమైన అంశాలను ఇందులో పొందుపర్చింది. కాగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేటీఆర్.
తనను కావాలని బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు ఎక్కారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పలు ప్రశ్నలను సంధించింది.
దీనికి ఎలాంటి సమాధానం చెప్పలేక పోయారు ప్రభుత్వ తరపు ప్రాసిక్యూటర్. నీళ్లు నమిలినట్లు సమాచారం. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ ను కలిసింది. వివరాలు సేకరించింది. వాటన్నింటిని కోర్టుకు సమర్పించింది. వీటినే కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చింది. కాగా తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి విచారణకైనా సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు కేటీఆర్.