8,9 తేదీలలో రావాలని ఆదేశం
హైదరాబాద్ – ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లకు నోటీసులు జారీ చేసింది. తమ ముందు ఈనెల 8,9వ తేదీలలో హాజరు కావాలని ఆదేశించింది. కాగా తమకు రెండు వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఒప్పుకునేది లేదని తప్పక అటెండ్ కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది ఈడీ.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ ) కేసు నమోదు చేసింది మాజీ మంత్రి కేటీఆర్ పై. తనను అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి తీసుకుంది. దీంతో సీఎస్ శాంతి కుమారి కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
ఇందులో భాగంగా హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ రంగంలోకి దిగింది. దీనిని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కేసు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.