Monday, April 21, 2025
HomeNEWSకేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు

కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు

అర‌వింద్ కుమార్ దే పూర్తి బాధ్య‌త

హైద‌రాబాద్ – ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ న్యాయ‌వాది సిద్దార్థ్ ద‌వే వాద‌నాలు వినిపించారు. ఈ కేసులో అర‌వింద్ కుమారే బాధ్యుడ‌ని అన్నారు. ఎఫ్ఈఓతో జ‌రిగిన ఒప్పందంలో కేటీఆర్ సంత‌కం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసులు న‌మోదు చేసిన 409 సెక్ష‌న్ వర్తించ‌ద‌న్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవ‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం క‌క్ష సాధింపుతోనే కేటీఆర్ పై కావాల‌ని కేసు న‌మోదు చేశార‌ని వాదించారు. ఇది పూర్తిగా నిల‌బ‌డ‌ద‌ని పేర్కొన్నారు. వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేందుకే పోలీసులు ఇలా అబ‌ద్ద‌పు కేసు న‌మోదు చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఏ కేసు చెల్ల‌ద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఫార్ములా ఈ కారు రేసు లో రూ. 40 కోట్ల‌ను ఎలాంటి అనుమ‌తులు లేకుండానే విదేశీ సంస్థ‌కు బ‌దిలీ చేశారంటూ ప్ర‌భుత్వం ఆరోపించింది. ఇదే అంశంపై ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ల‌బ్ది చేకూరిందంటూ కేటీఆర్ అరెస్ట్ కోసం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేశారు.

ఈ మేర‌కు ఈ కేసుకు సంబంధించి అవినీతి నిరోధ‌క శాఖ‌తో పాటు ఈడీ కేసు న‌మోదు చేసింది. కాగా ఇదంతా బ‌క్వాస్ అంటూ మండిప‌డ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments