స్పష్టం చేసిన హైకోర్టు
హైదరాబాద్ – ఫార్ములా ఈ కారు రేస్ కేసులో భారీ ఊరట లభించింది మాజీ మంత్రి కేటీఆర్ కు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది పోలీసులను. ఏసీబీ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కేసును రిజర్వ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో అరెస్ట్ చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.
గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తనను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ కు విన్నవించింది. తనపై కేసు నమోదుకు ఓకే చెప్పింది. దీంతో దూకుడు పెంచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.
దీంతో ఏసీబీ ఈ ఫార్ములా కారు రేస్ కు సంబంధించిన వివరాలను, ఆధారాలను ఈడీకి అందజేసింది. దీంతో తనను అరెస్ట్ చేయొద్దంటూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు.