NEWSTELANGANA

ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబ‌డి

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డి విజ‌న్ సూప‌ర్

హైద‌రాబాద్ – ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన సంస్థ ఫాక్స్ కాన్ తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీతో ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యాంగ్ లియూ భేటీ అయ్యారు.

అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యాల‌ను స్వాగ‌తించారు. ఇదే స‌మ‌యంలో ఫోర్త్ సిటీపై ఆస‌క్తిని క‌న‌బ‌ర్చారు చైర్మ‌న్ యాంగ్ లియూ.

తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్ కాన్‌ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇమిచ్చేలా పెట్టుబడులకు అనుకూలమైన కొత్త విధానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.

అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మిస్తున్నామని తెలిపారు సీఎం. ఫాక్స్‌కాన్‌ (Foxconn) సంస్థ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ప‌రిశ్ర‌మ‌లు నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్నిఅందిస్తామని యాంగ్ లియూకి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీ రూప‌క‌ల్ప‌న‌లో ముఖ్యమంత్రి దార్శ‌నిక‌త‌, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని ఫాక్స్‌కాన్‌ (Foxconn) చైర్మ‌న్ యాంగ్ లియూ (Young Liu) అన్నారు.

సాధ్యమైనంత తొందర్లోనే హైద‌రాబాద్ ను సంద‌ర్శిస్తానని ఫాక్స్‌కాన్‌ (Foxconn) చైర్మ‌న్ చెప్పారు. అంతకంటే ముందుగా ఫాక్స్‌కాన్‌ (Foxconn) క్యాంప‌స్ ఆప‌రేష‌న్స్ చీఫ్ క్యాథీ యాంగ్ (kathy yang), ఫాక్స్ కాన్‌ (Foxconn) భార‌త దేశ ప్ర‌తినిధి వీ లీ (V Lee) నేతృత్వంలోని బృందం హైద‌రాబాద్ వ‌స్తుంద‌ని యాంగ్ లియూ తెలిపారు.