తెలంగాణ ఫ్రీ క్యాబ్ సర్వీస్
హైదరాబాద్ – మద్యం ప్రియులకు ఖుష్ కబర్ చెప్పింతి తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్. రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. కొత్త ఏడాదిని పురస్కరించుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తామని తెలిపింది. 91776 24678 నెంబర్‌కి కాల్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామని వెల్లడించింది.
కేవలం న్యూ ఇయర్ వరకే ఈ ఉచిత సదుపాయాన్ని అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వాహనాల అసోసియేషన్ జాతీయ నేత షేక్ సలావుద్దీన్ వెల్లడించారు. దీని వల్ల లక్షలాది మంది ప్రయాణీకులకు మేలు చేకూరుతుందన్నారు. నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ అద్భుతమైన న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ ను నగర వాసులతో పాటు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.