130 కిలోమీటర్ల వేగం దాటితే కేసు
ఎఫ్ఐఆర్ నమోదుకు సీఎం ఆదేశం
కర్ణాటక – రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విలువైన ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఐటీ , పరిశ్రమలకు కేరాఫ్ గా కర్ణాటక పేరు పొందింది. నిత్యం వేలాది వాహనాలు రాష్ట్రంలోని రహదారులపై తిరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు.
ఇక నుంచి ఎవరైనా వేగంతో నడిపితే అలాంటి వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. ఈ మేరకు సీఎం ఆదేశాల మేరకు మంగళవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించింది.
ఈ రూల్స్ వచ్చే ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది సర్కార్. ఏ వాహనమైనా గంటకు 130 కిలోమీటర్లకు మించి డ్రైవింగ్ చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది సర్కార్.
ఇదిలా ఉండగా ఈ కొత్త నిబంధన హైవేలకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర రోడ్లపై తిరిగే వాహనదారులకు వర్తిస్తుందని స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య.