DEVOTIONAL

తిరుమ‌ల‌లో ముడి స‌రుకుల నాణ్య‌త‌పై ఫోక‌స్

Share it with your family & friends

పరిశోధనకు ఎఫ్ఏస్ఏస్ఏఐ టీటీడీ సహకారం

తిరుమల – తిరుమలకు ప్రతి రోజు శ్రీవారి దర్శనార్థం విచ్చేసి వేలాది మంది భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల ముడి సరుకులు ఎఫ్ఏస్ఏస్ఏఐ వారి సహకారంతో మరింత నాణ్యతతో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో జె. శ్యామ‌ల రావు అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఎఫ్ఏస్ఏస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా) సహకారంతో తిరుమలలో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఈవో చెప్పారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో ఎఫ్ఏస్ఏస్ఏఐ, టీటీడీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుత తిరుమలకు విచ్చేసే భక్తులకు అందించే ఆహార పదార్థాలలో వినియోగించే ముడి సరుకులను వివిధ టెండర్ల ద్వారా టీటీడీ కొనుగోలు చేస్తోందన్నారు. వీటి నాణ్యతను పెంచేందుకు అత్యాధునికమైన పరిశోధన కేంద్రంను ఎఫ్ఏస్ఏస్ఏఐ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

టీటీడీ కొనుగోలు చేస్తున్న వివిధ ముడి సరుకులు అత్యంత నాణ్యతతో ఉండడానికి గాను, వాటిని పరీక్షించేందుకు తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ లేబరటరీ (ఆహార ప్రయోగశాలలో ) మరింత పారదర్శకంగా నాణ్యతను పరిశీలించేందుకు వీలవుతుందన్నారు.

తిరుమలలో భక్తులకు అందిస్తున్న జల ప్రసాదం నాణ్యత, వంటశాలల లను ఎప్పటికప్పుడు పరీక్షించడం జరుగుతోందని చెప్పారు. ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి ఎస్ఓపిని తయారు చేయాల‌ని సూచించారు.

భక్తులకు అందించే అన్న ప్రసాద భవనంలో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. తిరుమలలో ప్రత్యేకంగా ఎఫ్ఏస్ఏస్ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వాలని జేఈవోను ఆదేశించారు.

ఈ సందర్భంగా న్యూఢిల్లీకి చెందిన ఎఫ్ఏస్ఏస్ఏఐ సీఈవో కమలవర్ధన్ రావు ఆదేశాల మేరకు, ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచంద్రరావు ఈ సందర్భంగా తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, జల ప్రసాదం తదితర అంశాలపై జాగ్రత్తలను, అదేవిధంగా నాణ్యత పెంచడానికి అవసరమైన సూచనలను ఈవోకు వివరించారు.

ఈ సమావేశంలో జేఈవో గౌతమి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫాస్ట్ ట్రాక్ నోడల్ అధికారి రవీంద్రారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఎఫ్ఏస్ఏస్ఏఐ అధికారి బాలు నాయక్, టీటీడీ సిఈ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.