ఐదేళ్లలో భారీగా పెరిగిన ఆస్తులు
హైదరాబాద్ – దేశం కోసం, ధర్మం కోసం అంటూ నిత్యం మాట్లాడే భారతీయ జనతా పార్టీ చీఫ్ , కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆస్తులు ఊహించని రీతిలో పెరిగాయి. ఏకంగా గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఆస్తులు 136 శాతం పెరగడం విస్తు పోయేలా చేసింది. ఎంత కష్టపడితే ఇన్ని ఆస్తులు సంపాదించ వచ్చని జనం ఆలోచిస్తున్నారు.
ఇది పక్కన పెడితే కిషన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. తను నామినేషన్ వేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తనకు రూ. 19.2 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా 2019లో జరిగిన ఎన్నికల అఫిడవిట్ లో కిషన్ రెడ్డి ఆస్తులు రూ. 8.1 కోట్లుగా చూపించారు. తాజాగా అవి రూ. 19.2 కోట్లకు ఎలా పెరిగాయన్నది అనుమానం కలుగుతోంది. బీజేపీ చీఫ్ ఆస్తులలో రూ. 8.3 కోట్ల చరాస్తులు ఉండగా రూ. 10.8 కోట్ల స్థిరాస్థులు ఉండడం విశేషం.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో కిషన్‌రెడ్డికి 8 ఎకరాల భూమి ఉంది. అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. 2022-23లో అతని ఆదాయం రూ. 13.5 లక్షలు.