మోదీ నాయకత్వం బీజేపీ విజయం
మరోసారి మాదే అధికారమన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్ – యావత్ ప్రపంచం మెచ్చిన అరుదైన నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని స్పష్టం చేశారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి. శుక్రవారం విజయ సంకల్ప్ యాత్ర లో భాగంగా హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్బంగా మహిళలు బతుకమ్మతో స్వాగతం పలికారు.
దేశంలో మోదీ హవా నడుస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి షాక్ తగలడం ఖాయమని జోష్యం చెప్పారు. తమ టార్గెట్ వైనాట్ 400 అని, మోదీ నిర్దేశించిన టార్గెట్ ను చేరుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు గంగాపురం కిషన్ రెడ్డి.
ఇక రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి, ప్రజలను మోసం చేసిన పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఎన్నికలు అయి పోయాక ఆ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదని పేర్కొన్నారు.
దేశంలోని 143 కోట్ల మంది భారతీయులంతా సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, ఆ రెండింటిని అందిస్తున్న ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు గంగాపురం కిషన్ రెడ్డి.