NEWSTELANGANA

అభివృద్దిలో మ‌హిళా శ‌క్తి కీల‌కం

Share it with your family & friends

కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి
హైద‌రాబాద్ – స‌మాజం అభివృద్ది చెందాలంటే మ‌హిళ‌ల స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌న్నారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి. రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే నారీమ‌ణులు ముఖ్య భూమిక పోషించాల‌ని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే శ‌క్తి వంద‌న్ వ‌ర్క్ షాప్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున మ‌హిళలు హాజ‌రు కావ‌డం సంతోషం క‌లిగిస్తోంద‌న్నారు గంగాపురం కిష‌న్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర మ‌హిళా చీఫ్ గా నియ‌మితులైన డాక్ట‌ర్ శిల్పా సునీల్ రెడ్డిని ప్ర‌త్యేకంగా అభినందించారు కేంద్ర మంత్రి.

రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళా శ‌క్తి వంద‌న్ వ‌ర్క్ షాప్ ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని ఇది మ‌న పార్టీ శ‌క్తి ఏమిటో తెలియ చేస్తుంద‌న్నారు . త్వ‌ర‌లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు రానున్నాయ‌ని, ఈసారి కూడా 400 సీట్ల‌కు పైగా బీజేపీ విజ‌యం సాధించాల‌ని, ఆ దిశ‌గా మ‌నం అడుగులు వేయాల‌ని పిలుపునిచ్చారు గంగాపురం కిష‌న్ రెడ్డి.