NEWSTELANGANA

బ‌డా బాబుల ఆస్తులు హైడ్రా కూల్చాలి – కిష‌న్ రెడ్డి

Share it with your family & friends

పేద‌ల జోలికి వ‌స్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రిక

హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. హైడ్రా పేరుతో స‌ర్కార్ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గురువారం కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

పేద‌ల‌కు సంబంధించిన ఇళ్ల‌పైకి వ‌స్తామ‌ని, కూల్చి వేస్తామంటే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టి దాకా ఓపిక‌గా ఉన్నామ‌ని, ఇక ఉపేక్షించ బోమంటూ పేర్కొన్నారు.

అనేక చెరువుల్లో బడా బాబులు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపారవేత్తల ఫాంహౌస్ లు, ఎస్టేట్ ల పేరుతో నిర్మాణాలు చేసుకున్నారని ఆరోపించారు. చేతనైతే, ద‌మ్ముంటే ముందు వారిపై హైడ్రా ప్ర‌తాపం చూపాల‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కు స‌వాల్ విసిరారు.

ఎవరు వచ్చినా కిషన్ రెడ్డి మమ్మల్ని ఖాళీ చెయ్యొద్దు అన్నారు అని చెప్పండి. ఎవ్వరూ వచ్చినా భయపడకండి. మా వాళ్ళు అందరూ మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ నాయకులు ఆర్ఆ ర్, ఆర్జీ టాక్స్ వసూళ్లతో దోపిడీకి పాల్పడుతున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు గంగాపురం కిష‌న్ రెడ్డి. పేద ప్రజలపై ప్రతాపం చూపాలని అనుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.