సౌమ్యుడికి మరోసారి ఛాన్స్
మోడీకి కిషన్ రెడ్డి నమ్మిన బంటు
హైదరాబాద్ – సౌమ్యుడిగా పేరు పొందిన గంగాపురం కిషన్ రెడ్డికి మరోసారి మోడీ కేబినెట్ లో అవకాశం దక్కింది. ఒక రకంగా చిన్నప్పటి నుంచి పార్టీ కోసం కట్టుబడిన వ్యక్తిగా పేరు పొందారు. ఎన్నో పదవులు నిర్వహించారు. మోడీ టీంలో ఒకడిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీని విజయ పథంలో నడపడంలో కీలక పాత్ర పోషించాడు.
కేంద్ర ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డికి పార్టీ అనూహ్యంగా పగ్గాలు అప్పగించింది. అంతకు ముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు కిషన్ రెడ్డి.
ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా పని చేశారు. అంబర్ పేట శాసన సభ నియోజకవర్గంలో పిలిచే నాయకుడిగా పేరు పొందారు. 15 జూన్ 1964లో పుట్టారు. సామాన్య కుటుంబం ఆయనది. 2019లో ఏపీ శాసన సభలో ఫ్లోర్ లీడర్ గా పని చేశాడు.
ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్. 1977లో జనతా పార్టీ యువ నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. వెంకయ్య నాయుడు శిష్యుడిగా పేరు పొందారు. బీజేపీ మోర్చా రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. 1983 నుండి 1984 వరకు బీజేపీ కార్యదర్శిగా ఉన్నారు.
బీజేపీలో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కీలక పదవులు పని చేశారు. 2004 నుండి 2009 వరకు హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కిషన్ రెడ్డి. 2009 నుండి 2014 వరకు అంబర్ పేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా మరోసారి అవకాశం దక్కించు కోవడం విశేషం.