NEWSTELANGANA

మైనింగ్ ప్రాంతాల‌లో ఎకో టూరిజం

Share it with your family & friends

ప్ర‌యారిటీ ఇస్తామ‌న్న కేంద్ర మంత్రి

ఢిల్లీ – కేంద్ర గ‌నుల శాఖ మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో మైనింగ్ ప్రాంతాల‌లో ప్ర‌కృతి విధ్వంసం కాకుండా ఉండేందుకు గాను ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ఆలోచ‌న చేస్తోంద‌ని తెలిపారు.

మంగ‌ళ‌వారం గంగాపురం కిష‌న్ రెడ్డి త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించ‌కుండా ఉండేలా ప్ర‌తి ఒక్క‌రు త‌మ బాధ్య‌త‌ను గుర్తించాల‌ని అన్నారు . రోజు రోజుకు ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించ‌కుండా ఉండాలంటే విరివిగా ఎకో టూరిజాన్ని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు గంగాపురం కిష‌న్ రెడ్డి.

బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని NCL, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో ఉన్న ముద్వానీ డ్యామ్‌ను శక్తి వంతమైన పర్యావరణ ఉద్యానవనంగా మారుస్తోందని ప్ర‌శంసించారు కేంద్ర మంత్రి.

అభివృద్ధిలో తేలికపాటి ఫౌంటెన్, స్థానిక క్రాఫ్ట్ దుకాణాలు, సుందరమైన మార్గాలు, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం జ‌రుగుతుంద‌న్నారు గంగాపురం కిష‌న్ రెడ్డి. బొగ్గు క్షేత్రాల సమీపంలో స్థానిక సమాజానికి కొత్త అవకాశాలను సృష్టించడం వీల‌వుతుంద‌ని తెలిపారు.