కెనడా ప్రధానమంత్రికి కోలుకోలేని షాక్
బ్రెజిల్ – కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఘోరమైన అవమానం చోటు చేసుకుంది. ఆయనను ఎవరూ పట్టించుకోక పోవడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కెనడాలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. ఆయన ప్రధానంగా భారత దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. అంతే కాకుండా కెనడాలో తన పదవిని రక్షించుకునేందుకు ఇండియాను టార్గెట్ చేయడం విస్తు పోయేలా చేసింది. ఇదే విషయాన్ని పదే పదే ప్రపంచానికి తెలియ చేసే ప్రయత్నం చేసింది భారత దేశం.
మరో వైపు తనకు సపోర్ట్ గా ఉంటూ వచ్చిన యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రభుత్వం ఘోరంగా ఓడి పోయింది. డొనాల్డ్ ట్రంప్ పవర్ లోకి రావడంతో చుక్కలు చూపించడం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కెనడాకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు దేశ నూతన అధ్యక్షుడు. ఆయన పూర్తిగా ఇండియాకు, పీఎం నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో రష్యాతో కూడా సన్నిహితంగా ఉన్నారు. ఇక రష్యా కూడా భారత్ కు బేషరతు మద్దతు ఇస్తోంది.
తాజాగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. బ్రెజిల్ వేదికగా ప్రస్తుతం జి20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రపంచంలోని కీలకమైన దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు కూడా హాజరయ్యారు. అయితే కెనడా పీఎం ట్రూడో లేకుండానే అధినేతలంతా గ్రూప్ ఫోటో దిగారు. దీంతో తీరని అవమానం జరిగింది పీఎంకు.