Friday, April 4, 2025
HomeNEWSINTERNATIONALఉక్రెయిన్ కు 50 బిలియ‌న్ డాల‌ర్లు

ఉక్రెయిన్ కు 50 బిలియ‌న్ డాల‌ర్లు

ఇట‌లీ జి7 శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో తీర్మానం

ఇట‌లీ – తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ కు తీపి క‌బురు చెప్పింది ఇట‌లీ లోని అపులియా ప్రాంతంలో జ‌రిగిన జి7న శిఖ‌రాగ్ర స‌ద‌స్సు . ఈ మేర‌కు పాల్గొన్న దేశాల‌న్నీ మూకుమ్మ‌డిగా ఉక్రెయిన్ చీఫ్ కు శుభ‌వార్త చెప్పారు. ర‌ష్యా దాడుల‌తో అస్త‌వ్య‌స్తంగా మారిన త‌మ దేశానికి ఆర్థిక సాయం కావాల‌ని కోర‌డంతో మాన‌వ‌తా దృక్ఫ‌థంతో సాయం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది స‌ద‌స్సు.

జి7 నాయ‌కులు ఇందుకు అంగీకారం తెల‌ప‌డంతో ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు ధ‌న్య‌వాదాలు తెలిపారు.
స‌మ్మిట్ సందర్భంగా స్తంభింప చేసిన రష్యన్ ఆస్తులపై లాభాల ద్వారా ఉక్రెయిన్‌కు నిధులు సమకూర్చే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

ఈ శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ , ఇండియా పీఎం న‌రేంద్ర మోడీ హాజ‌ర‌య్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments