NEWSTELANGANA

తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్ గా గుమ్మ‌డి వెన్నెల

Share it with your family & friends

ప్ర‌జా గాయ‌కుడు దివంగ‌త గ‌ద్ద‌ర్ కూతురికి స‌ర్కార్ గౌర‌వం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్ గా దివంగ‌త ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ అలియాస్ గుమ్మ‌డి విఠ‌ల్ రావు కూతురు డాక్ట‌ర్ గుమ్మ‌డి వెన్నెల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు శనివారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి, పార్టీ హైక‌మాండ్ ఆదేశాల మేర‌కు గ‌ద్ద‌ర్ కూతురుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ రాష్ట్ర సాధ‌నలో , పోరాటంలో కీల‌క‌మై పాత్ర పోషించారు దివంగ‌త గ‌ద్ద‌ర్. ఆయ‌న కుటుంబం కూడా ఈ పోరాటంలో పాలు పంచుకుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన ప్ర‌జా గాయ‌కుల‌లో గ‌ద్ద‌ర్ కూడా ఒక‌రు. ఇదిలా ఉండ‌గా ఆయ‌న గుండె పోటుతో మ‌ర‌ణించారు. కాంగ్రెస్ పార్టీ గ‌ద్ద‌ర్ కూతురుకు శాస‌న స‌భ ఎన్నిక‌ల‌లో టికెట్ కూడా ఇచ్చింది. కానీ ఆమె ఓట‌మి పాల‌య్యారు.

అయినా పార్టీ అధిష్టానం గ‌ద్ద‌ర్ మీద ఉన్న గౌర‌వంతో రాష్ట్ర కెబినెట్ ప‌ద‌వితో స‌మానమైన తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్ గా నియ‌మించ‌డం విశేషం. గ‌ద్ద‌ర్ కూతురు కూడా గాయ‌కురాలు. సాంస్కృతిక యోధురాలు .