బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వైరల్
రాష్ట్రానికి ఏమిచ్చింది గాడిద గుడ్డు
హైదరాబాద్ – కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మోడీ సర్కార్ బేకార్ అన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో అసలు తెలంగాణ రాష్ట్రం పేరు కూడా ప్రస్తావించిన పాపాన పోలేదు. నిధుల కేటాయింపు లేదు. ఆపై విభజన చట్టం ప్రకారం రావాల్సిన పనులు, నిధుల మంజూరు గురించి మాట మాత్రమైనా ఊసెత్తలేదు.
అదే కేంద్ర సర్కార్ లో కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు. రూ. 15 వేల కోట్లు ఏపీకి కేటాయిస్తే రూ. 25 వేల కోట్లు బీహార్ కు కేటాయించింది మోడీ సర్కార్ . దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఇద్దరికి కేంద్ర పదవులు దక్కాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఈ ఇద్దరు మౌనం వహించారు. తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించక పోవడం విస్తు పోయేలా చేసింది. ఇక ఎంపీలు నోరు మెదపక పోవడం దారుణం.
ఈ మొత్తం వ్యవహారంపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ తీర్మానం చేసింది. మోడీ సర్కార్ వ్యతిరేకంగా. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నిరసన తెలియ చేస్తూ రాష్ట్రానికి ఏమిచ్చింది గాడిద గుడ్డు తప్ప అన్న పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి.