జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్
హైదరాబాద్ – ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే పాటలు ప్రజాదరణ పొందాయి. రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించారు. మెగా ఫ్యాన్స్ ఇప్పుడే సంబురాలలో మునిగి పోయారు.
జనవరి 2న గురువారం భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరోసారి దిగ్గజ దర్శకుడు శంకర్ తనదైన మార్క్ కనిపించేలా చేశారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ఇందులో కీలకమైన పాత్ర పోషించింది.
వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు నిర్మాత దిల్ రాజు. పలు భారతీయ భాషల్లో ఇది ముందుకు రానుంది. సినిమా ఆకర్షణను మరింతగా పెంచేలా చేసింది. కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో మరిన్ని అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన లభించింది.