జనవరి 1న గేమ్ ఛేంజర్ ట్రైలర్
ప్రకటించిన నిర్మాత దిల్ రాజు
విజయవాడ – శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై కీలక ప్రకటన చేశారు నిర్మాత దిల్ రాజు. మెగా ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పారు. జనవరి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజర్ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తామన్నారు. రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకటించారు. 10వ తేదీన థియేటర్లు దద్దరిల్లడం ఖాయమన్నారు. విజయవాడ సినీ రంగానికి పుట్టినిల్లు అన్నారు.
గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని చెప్పారు దిల్ రాజు. మెగా పవర్ స్టార్‌లో మెగాని చూస్తారు, పవర్‌ని చూస్తారన్నారు. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
మెగాస్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అందిస్తే ..ఆ తర్వాత మెగా పవర్ స్టార్ వచ్చారని అన్నారు. ఫ్యాన్స్ గా మీ విలువ వెల కట్టలేనిదని స్పష్టం చేశారు దిల్ రాజు. రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఆవిష్కరించారు.
ఏకంగా 256 అడుగులతో నిర్మించడం విశేషం. హెలికాప్టర్ ద్వారా కటౌట్ పై పూల వర్షం కురిపించారు. మెగా ఫ్యాన్స్ ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వచ్చారు.