కర్నూలులో ఘనంగా గణేశ్ శోభా యాత్ర
పాల్గొన్న ఏపీ మంత్రి టీజీ భరత్
కర్నూల్ జిల్లా – కర్నూలులోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి పూజలు నిర్వహించారు ఏపీ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ . ఆదివారం భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా గణేశుడికి పెద్ద ఎత్తున పూజలు చేపట్టారు మంత్రి టీజీ భరత్. గణనాథుడిని నిమజ్జనానికి సాగనంపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి భరత్ తో పాటు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, నగర మేయర్ బి.వై. రామయ్య, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఆదివారం కర్నూల్ లో గణేష్ శోభా యాత్ర కనుల విందుగా సాగింది. వివిధ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా ఏర్పాటు చేసిన వినాయకులు గంగమ్మ ఒడిలోకి వెళ్లాయి. శోభ యాత్ర సందర్బంగా కర్నూల్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.