సర్కార్ నిర్లక్ష్యం గురుకులాలకు శాపం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గంగుల
హైదరాబాద్ – మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం ఆయన గురుకులాల విద్యార్థులను పరామర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 గురుకులాలను మాత్రమే పెట్టి పేద బడుగు వర్గాల పిల్లలకు చదువును దూరం చేశాయి అప్పటి ప్రభుత్వాలంటూ ఆరోపించారు.
సొంత రాష్ట్రం సాధించాక పేద పిల్లల భవిష్యత్తు కోసం కేసీఆర్ 327 గురుకులాలను స్థాపించి దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు.
కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ గురుకులాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించక, గురుకులాలను పట్టించుకోక పేద విద్యార్థుల భావిష్యత్తుని అంధకారంలో నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు గంగుల కమలార్.
తమను పట్టించు కోవడం లేదంటూ చిన్నారులు, బాలికలు రోడ్లపైకి వస్తున్నా కనీసం సీఎం స్పందించక పోవడం దారుణమన్నారు మాజీ మంత్రి.