‘రుషికొండ’ కాదది అనకొండ
ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు
విశాఖపట్టణం – మాజీ మంత్రి , ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆదివారం స్థానిక నేతలతో కలిసి రిషి కొండపై రూ. 500 కోట్లతో నిర్మాణం చేపట్టిన ప్యాలస్ ను సందర్శించారు. కళ్లు చెదిరేలా అత్యధికంగా ఖర్చు చేసి నిర్మించారు. తాను మరోసారి సీఎం అవుతానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తానని కలలు కన్నాడంటూ జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
గంటా శ్రీనివాస రావు రిషికొండ ప్యాలస్ లోకి వెళ్లారు. భవనం కళ్లు చెదిరేలా ఉంది. పోలీసులను పహారాగా పెట్టి ఎవరినీ లోపలకు వెళ్లనీయకుండా నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. రుషికొండ భవనం నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారని మండిపడ్డారు.
ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను.. అనుమతులు లేవనే కారణంతో జగన్ సర్కార్ కూల్చివేసిందన్నారు. రుషికొండ భవనానికి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించారని ఆరోపించారు గంటా శ్రీనివాస రావు.
ఎవరినీ అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి ప్రారంభించారని తెలిపారు. ఇంత విలాస వంతమైన భవనాలు ఎందుకు నిర్మించరో జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.