మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం – ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వైసీపీ చీఫ్ , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఆయన పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై లేనిపోని ఆరోపణలు మానుకుంటే బెటర్ అని సూచించారు.
తాము గనుక కచ్చితంగా ఫోకస్ పెడితే, గేట్లు ఓపెన్ చేస్తే ఏ ఒక్కరు కూడా వైసీపీలో ఉండరని అన్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచించారు. తాము వద్దన్నా వచ్చేందుకు వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు సిద్దంగా ఉన్నారని అన్నారు గంటా శ్రీనివాసరావు.
ప్రజలు ఛీ కొట్టారని, చివరకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఇంతకు మించిన అవమానం ఇంకెక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా దోచు కోవడం, దాచు కోవడం తప్పితే చేసింది ఏమిందంటూ మండిపడ్డారు మాజీ మంత్రి.
ఇప్పుడు కొందరు మాత్రమే చేరారని, మరో వారం రోజుల్లో మరికొందరు చేరబోతున్నారంటూ గంటా బాంబు పేల్చారు. అయితే తమ పార్టీలో కష్టపడి పని చేసేవారికి సముచితమైన స్థానం తప్పకుండా ఉంటుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.