వైభవంగా మాఘ పౌర్ణమి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుమల పుణ్య క్షేత్రంలో అంగరంగ వైభవోపేతంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో దీనిని చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు స్వామి వారిని దర్శించుకునేందుకు .
ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు.
టీటీడీ ఈవో జె. శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం ఏర్పాట్లను పరిశీలించారు. అందుతున్న సౌకర్యాల పట్ల భక్తులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించారంటూ ప్రశంసలు కురిపించారు టీటీడీ పాలక మండలిపై.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.