ఘనంగా పౌర్ణమి గరుడ సేవ
పోటెత్తిన భక్త బాంధవులు
తిరుమల – తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతే గాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియ చేస్తారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా , ఆపద మొక్కుల వాడా గోవిందా , అనాధ రక్షక గోవిందా భక్తులు స్మరిస్తున్నారు. స్వామి వారి కృప తమకు ఉండాలని కోరుతున్నారు.