మోదీ గురించి మాట్లాడితే ఊరుకోం – భాటియా
సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ పై కామెంట్స్
ఢిల్లీ – భారతీయ జనతా పార్టీ నేత గౌరవ్ భాటియా సీరియస్ అయ్యారు. ఇండియా టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా సదరు ఛానల్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జరిగిందేదో జరిగి పోయింది..మీరు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీపై వ్యక్తిగత కామెంట్స్ ఎలా చేస్తారంటూ రాజ్ దీప్ ను నిలదీశారు. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే తాము చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు. తీవ్రంగా వార్నింగ్ ఇస్తున్నానని..జర జాగ్రత్త అంటూ ఫైర్ అయ్యారు గౌరవ్ భాటియా.
దీంతో చర్చకు వచ్చిన వారంతా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న గౌరవ్ భాటియా ఇలా వ్యక్తిగతంగా దూషించడం, ఆపై హెచ్చరికలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొంటున్నారు జర్నలిస్టులు..మేదావులు.
అయితే తనను బెదిరిస్తున్నారా అంటూ ప్రతిస్పందించారు రాజ్ దీప్ సర్దేశాయ్. అయితే తీవ్ర ఆరోపణలు చేశారు గౌరవ్ భాటియా. మీకు వ్యక్తిగత ఎజెండా ఉందని , అందుకే ఇలా బీజేపీని, ప్రధానమంత్రి మోడీని పనిగట్టుకుని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.