డిజిటల్ సహకారం ఆర్థిక పురోగమనం
స్పష్టం చేసిన యూట్యూబర్ గౌరవ్ చౌదరి
న్యూఢిల్లీ – ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ప్రస్తుతం డిజిటల్ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఆయనను అంతా టెక్నికల్ గురూజీ అని పిలుస్తారు. టెక్నికల్ గా భారీ ఎత్తున ప్రతిభా నైపుణ్యాలు కలిగి ఉన్నారు. ఈ సందర్బంగా ఇండియాలోని స్టార్టప్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2014లో భారత దేశంలో సుమారు 300 స్టార్టప్ లు ఉన్నాయని చెప్పారు.
మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల కారణంగా భారత దేశం డిజిటల్ పరంగా అభివృద్ది సాధించిందని తెలిపారు గౌరవ్ చౌదరి. ఇవాళ దేశ వ్యాప్తంగా లక్షకు పైగా స్టార్టప్ లు ఉన్నాయని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఎన్నో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.
మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి ప్రభుత్వ పథకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూపాయని స్పష్టం చేశారు గౌరవ్ చౌదరి. అయితే వ్యాపారం గురించి మాట్లాడినట్లయితే, వారు కూడా దాని నుండి ప్రయోజనం పొందారని అన్నారు. అంతే కాకుండా భారతీయ ఆర్థిక వ్యవస్థకు డిజిటలైజేషన్ టెక్నాలజీ దోహదకారిగా ఉందన్నారు యూట్యబర్.