NEWSNATIONAL

రైతుల‌ను విస్మ‌రించిన బ‌డ్జెట్

Share it with your family & friends

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గొగోయ్

న్యూఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండి ప‌డింది. ఈ మేర‌కు పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ గౌర‌వ్ గొగోయ్ నిప్పులు చెరిగారు. ఆరుగాలం శ్ర‌మించి పంట‌లు పండించే రైతుల గురించి ప్ర‌స్తావ‌న లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హామీలు త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో పూర్తిగా మోదీ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు.

కేవ‌లం ధ‌న‌వంతుల‌, వ్యాపార‌వేత్త‌ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు మాత్ర‌మే ఈ బ‌డ్జెట్ ను త‌యారు చేశారంటూ మండిప‌డ్డారు. ఈ ప్ర‌భుత్వం ఎంపిక చేసిన పారిశ్రామిక‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకే ఉంద‌న్నారు గౌర‌వ్ గొగోయ్.

గ‌తంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌ని మోదీ ప్ర‌భుత్వం హామీ ఇచ్చింద‌ని, కానీ దేశంలో ప్ర‌తి ఏడాది 10 వేల మంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులు ప్ర‌పంచం విస్తు పోయేలా ఆందోళ‌న చేప‌ట్టారు. కానీ వారి గోడు గురించి ఒక్క మాటైనా లేక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు కాంగ్రెస్ ఎంపీ.

పంట‌ల భీమాకు సంబంధించి ధీమా ఇవ్వ‌లేని ఈ స‌ర్కార్ ఉన్నా లేకున్నా ఒక్క‌టేనంటూ ఎద్దేవా చేశారు.