సంపద సృష్టించడం నేరం కాదు
గౌరవ్ వల్లభ్ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పదవికి గుడ్ బై చెప్పిన గౌరవ్ వల్లభ్ గురువారం బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పదే పదే పార్టీలో ఉన్న పరిస్థితుల గురించి ఏకరువు పెట్టానని కానీ హైకమాండ్ పట్టించు కోలేదని ఆరోపించారు. పవర్ సెంటర్స్ ఇప్పుడు పెతత్నం చెలాయిస్తున్నాయని, తమ లాంటి వాళ్లకు ప్లేస్ లేకుండా పోయిందని వాపోయారు గౌరవ్ వల్లభ్.
అందుకే తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. పార్టీలో రోజు రోజుకు ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నా రాజీనామా లేఖను నేరుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అందజేశానని తెలిపారు. ఇందులో మూడు ప్రధాన అంశాల గురించి ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.
దేశం ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే పారిశ్రామికవేత్తల మద్దతు కూడా అవసరం ఉంటుందన్నారు. కానీ ఇవేవీ అర్థం చేసుకోకుండా రేయింబవళ్లు , 24 గంటల పాటు బడా బాబులను తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా ముందుకు వెళతామని ప్రశ్నించారు. అయితే సంపద సృష్టించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు గౌరవ్ వల్లభ్.
భాజపాలో చేరిన సందర్భంగా గౌరవ్ వల్లభ్ ఇలా అన్నారు, “… నా రాజీనామా లేఖలో 2-3 ప్రధాన అంశాలు ఉన్నాయి… సంపద సృష్టికర్తలను ఉదయం-సాయంత్రం దుర్వినియోగం చేయలేను. సంపద సృష్టించడం నేరం కాదు.”