అదానీ పారిపోయే ప్రమాదం ఉంది – సీఎం
సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక – రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఆ శక్తులు ఎవరో దేశ ప్రజలకంతా తెలుసన్నారు.
తన పనులు పొందేందుకు భారీ ఎత్తున లంచాలు ఇవ్వ చూపాడని ఇందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ అమెరికా పేర్కొన్నప్పటికీ అదానీని ఎందుకు రక్షిస్తున్నారంటూ నిలదీశారు సీఎం సిద్దరామయ్య.
అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు అదానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. ప్రధానంగా భారతీయ వ్యాపారేవత్తను రక్షిస్తున్నది మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం.
అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని, లేకుంటే పరారీలో ఉండే అవకాశం ఉందన్నారు సిద్దరామయ్య.
అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతి అదానీ కారణంగా మంట గలిసి పోయిందన్నారు. దీనిని ఎందుకు మీడియా హైలెట్ చేయడం లేదంటూ మండిపడ్డారు.