బీసీసీఐకి గౌతమ్ గంభీర్ కండీషన్స్
ఎట్టకేలకు ఒప్పుకున్న క్రీడా సంస్థ
ముంబై – భారత దేశంలోనే కాదు ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన సంస్థగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి పేరుంది. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్ గా బెంగళూరుకు చెందిన రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్నారు.
తన పదవీ కాలం పూర్తి కావస్తుండడంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. చివరకు ఇద్దరు మాత్రమే మిగిలారు కోచ్ రేసులో. ఒకరు తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్ ఎంవీ రామన్ కాగా మరొకరు ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
తాజాగా జరిగిన ఐపీఎల్ టోర్నీలో బాలీవుడ్ బాద్ షాకు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. దీని వెనుక మెంటార్ గా పని చేసిన గంభీర్ ఉన్నాడు. దీంతో బీసీసీఐ అతడి వైపే మొగ్గు చూపించింది.
అయితే తాను హెడ్ కోచ్ గా పని చేయాలంటే తాను చెప్పినట్టు వినాలని, తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, తను తీసుకునే నిర్ణయాలలో ఎవరూ జోక్యం చేసుకోకూడదంటూ కండీషన్స్ పెట్టాడని సమాచారం. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో అతడు చెప్పిన వాటికి ఓకే చెప్పినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.