డ్రెస్సింగ్ రూమ్ చర్చలపై లీకులు
ఆస్ట్రేలియా – భారత ఆటగాళ్ల తీరుపై సీరియస్ అయ్యాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సీరీస్ ఆడుతోంది. ఈ సందర్బంగా ఇప్పటికే భారత జట్టు 2 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. డ్రెస్సింగ్ రూమ్ లో తాను మాట్లాడిన మాటలు ఎలా బయటకు వచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమ్ స్పిరిట్ అనేది ముఖ్యమన్నారు.
విచిత్రం ఏమిటంటే తనను ఏరికోరి బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ భారత జట్టులో ప్రధానంగా సీనియర్ ఆటగాళ్లు సరిగా ఆడక పోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. మరో వైపు యువ ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నారు.
స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్ పర్ ఫార్మెన్స్ జట్టుకు భారంగా మారింది. ఈ తరుణంలో బీసీసీఐ సైతం గౌతమ్ గంభీర్ పై మరింత ఒత్తిడి తీసుకు వచ్చేలా చేసింది. నాలుగో టెస్టులో ఆసిస్ చేతిలో ఓడి పోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గంభీర్. తాను మాట్లాడిన మాటలు బయటకు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు . ఇలా లీకులు ఇస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.